بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
عَبَسَ وَتَوَلَّىٰٓ ١అతను (ప్రవక్త) భృకుటి ముడి వేసుకున్నాడు మరియు ముఖం త్రిప్పుకున్నాడు أَن جَآءَهُ ٱلۡأَعۡمَىٰ ٢ఆ గ్రుడ్డివాడు తన వద్దకు వచ్చాడని وَمَا يُدۡرِيكَ لَعَلَّهُۥ يَزَّكَّىٰٓ ٣కాని నీకేం తెలుసు? బహుశా అతడు తనను తాను సంస్కరించుకోవచ్చు أَوۡ يَذَّكَّرُ فَتَنفَعَهُ ٱلذِّكۡرَىٰٓ ٤లేదా అతడు హితబోధ పొందవచ్చు మరియు ఆ హితబోధ అతనికి ప్రయోజనకరం కావచ్చు أَمَّا مَنِ ٱسۡتَغۡنَىٰ ٥కాని అతడు, ఎవడైతే తనను తాను స్వయం సమృద్ధుడు, అనుకుంటున్నాడో فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ ٦అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు وَمَا عَلَيۡكَ أَلَّا يَزَّكَّىٰ ٧ఒకవేళ అతడు సంస్కరించుకోక పోతే నీపై బాధ్యత ఏముంది وَأَمَّا مَن جَآءَكَ يَسۡعَىٰ ٨కాని, ఎవడైతే తనంతట తాను, నీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడో وَهُوَ يَخۡشَىٰ ٩మరియు (అల్లాహ్ యెడల) భీతిపరుడై ఉన్నాడో فَأَنتَ عَنۡهُ تَلَهَّىٰ ١٠అతనిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు كـَلَّآ إِنَّهَا تَذۡكِرَةٌ ١١అలా కాదు! నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) ఒక హితోపదేశం فَمَن شَآءَ ذَكَرَهُۥ ١٢కావున ఇష్టమున్నవారు దీనిని స్వీకరించవచ్చు فِي صُحُفٍ مُّكَرَّمَةٍ ١٣ఇది ప్రతిష్ఠాకరమైన పుటలలో (వ్రాయబడి ఉన్నది) مَّرۡفُوعَةٍ مُّطَهَّرَةِۭ ١٤మహోన్నతమైనది, పవిత్రమైనది بِأَيۡدِي سَفَرَةٍ ١٥లేఖకుల (దేవదూతల) చేతులలో كِرَامِۭ بَرَرَةٍ ١٦వారు గౌరవనీయులైన సత్పురుషులు (ఆజ్ఞానువర్తనులు) قُتِلَ ٱلۡإِنسَٰنُ مَآ أَكۡفَرَهُۥ ١٧మానవుడు నాశనం గాను! అతడు ఎంత కృతఘ్నుడు مِنۡ أَيِّ شَيۡءٍ خَلَقَهُۥ ١٨ఆయన (అల్లాహ్) దేనితో అతనిని సృష్టించాడు مِن نُّطۡفَةٍ خَلَقَهُۥ فَقَدَّرَهُۥ ١٩అతనిని వీర్యబిందువుతో సృష్టించాడు తరువాత అతనిని తగిన విధంగా తీర్చిదిద్దాడు ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ ٢٠ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు ثُمَّ أَمَاتَهُۥ فَأَقۡبَرَهُۥ ٢١ఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు ثُمَّ إِذَا شَآءَ أَنشَرَهُۥ ٢٢మళ్ళీ ఆయన (అల్లాహ్) కోరినప్పుడు అతనిని తిరిగి బ్రతికించి లేపాడు كـَلَّا لَمَّا يَقۡضِ مَآ أَمَرَهُۥ ٢٣అలా కాదు, ఆయన (అల్లాహ్) ఆదేశించిన దానిని (మానవుడు) నెరవేర్చలేదు فَلۡيَنظُرِ ٱلۡإِنسَٰنُ إِلَىٰ طَعَامِهِۦٓ ٢٤ఇక, మానవుడు తన ఆహారాన్ని గమనించాలి أَنَّا صَبَبۡنَا ٱلۡمَآءَ صَبًّا ٢٥నిశ్చయంగా మేము నీటిని (వర్షాన్ని) ఎంత పుష్కలంగా కురిపించాము ثُمَّ شَقَقۡنَا ٱلۡأَرۡضَ شَقًّا ٢٦ఆ తరువాత భూమిని (మొలిచే మొక్కలతో) చీల్చాము, ఒక అద్భుతమైన చీల్పుతో فَأَنۢبَتۡنَا فِيهَا حَبًّا ٢٧తరువాత దానిలో ధాన్యాన్ని పెంచాము وَعِنَبًا وَقَضۡبًا ٢٨మరియు ద్రాక్షలను మరియు కూరగాయలను وَزَيۡتُونًا وَنَخۡلًا ٢٩మరియు ఆలివ్ (జైతూన్) మరియు ఖర్జూరపు చెట్లను وَحَدَآئِقَ غُلۡبًا ٣٠మరియు దట్టమైన తోటలను وَفَٰكِهَةً وَأَبًّا ٣١మరియు (రకరకాల) పండ్లను మరియు పచ్చికలను مَّتَٰعًا لَّكُمۡ وَلِأَنۡعَٰمِكُمۡ ٣٢మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా فَإِذَا جَآءَتِ ٱلصَّآخَّةُ ٣٣ఎప్పుడైతే, చెవులను చెవిటిగా చేసే ఆ గొప్ప ధ్వని వస్తుందో يَوۡمَ يَفِرُّ ٱلۡمَرۡءُ مِنۡ أَخِيهِ ٣٤ఆ రోజు, మానవుడు తన సోదరుని నుండి దూరంగా పారిపోతాడు وَأُمِّهِۦ وَأَبِيهِ ٣٥మరియు తన తల్లి నుండి మరియు తండ్రి నుండి وَصَٰحِبَتِهِۦ وَبَنِيهِ ٣٦మరియు తన భార్య (సాహిబతి) నుండి మరియు తన సంతానం నుండి لِكُلِّ ٱمۡرِيٍٕ مِّنۡهُمۡ يَوۡمَئِذٍ شَأۡنٌ يُغۡنِيهِ ٣٧ఆ రోజు వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే చాలినంత చింత ఉంటుంది وُجُوهٌ يَوۡمَئِذٍ مُّسۡفِرَةٌ ٣٨ఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాయి ضَاحِكَةٌ مُّسۡتَبۡشِرَةٌ ٣٩అవి చిరునవ్వులతో ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంటాయి وَوُجُوهٌ يَوۡمَئِذٍ عَلَيۡهَا غَبَرَةٌ ٤٠మరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి تَرۡهَقُهَا قَتَرَةٌ ٤١అవి నల్లగా మాడిపోయి ఉంటాయి أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡكَفَرَةُ ٱلۡفَجَرَةُ ٤٢అలాంటి వారు, వారే! సత్యతిరస్కారులైన దుష్టులు