Millat al-Islam

Chapter 87 · 19 verses · Abdul Raheem Mohammad Moulana

Surah Al-Ala in Telugu

Arabic with tafsir Listen to Surah Al-Ala (1421 reciters)
Meccanسورة الأعلى19 verses

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

سَبِّحِ ٱسۡمَ رَبِّكَ ٱلۡأَعۡلَى ١అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు ٱلَّذِي خَلَقَ فَسَوَّىٰ ٢ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు وَٱلَّذِي قَدَّرَ فَهَدَىٰ ٣మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు وَٱلَّذِيٓ أَخۡرَجَ ٱلۡمَرۡعَىٰ ٤మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు فَجَعَلَهُۥ غُثَآءً أَحۡوَىٰ ٥మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు سَنُقۡرِئُكَ فَلَا تَنسَىٰٓ ٦మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు إِلَّا مَا شَآءَ ٱللَّهُۚ إِنَّهُۥ يَعۡلَمُ ٱلۡجَهۡرَ وَمَا يَخۡفَىٰ ٧అల్లాహ్ కోరింది తప్ప! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు وَنُيَسِّرُكَ لِلۡيُسۡرَىٰ ٨మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము فَذَكِّرۡ إِن نَّفَعَتِ ٱلذِّكۡرَىٰ ٩కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు سَيَذَّكَّرُ مَن يَخۡشَىٰ ١٠(అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు وَيَتَجَنَّبُهَا ٱلۡأَشۡقَى ١١మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు ٱلَّذِي يَصۡلَى ٱلنَّارَ ٱلۡكُبۡرَىٰ ١٢అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحۡيَىٰ ١٣అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు قَدۡ أَفۡلَحَ مَن تَزَكَّىٰ ١٤సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు وَذَكَرَ ٱسۡمَ رَبِّهِۦ فَصَلَّىٰ ١٥మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు بَلۡ تُؤۡثِرُونَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا ١٦అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు وَٱلۡأٓخِرَةُ خَيۡرٌ وَأَبۡقَىٰٓ ١٧కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది إِنَّ هَٰذَا لَفِي ٱلصُّحُفِ ٱلۡأُولَىٰ ١٨నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది صُحُفِ إِبۡرَٰهِيمَ وَمُوسَىٰ ١٩ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో

Translation: Abdul Raheem Mohammad Moulana.