Millat al-Islam

Chapter 96 · 19 verses · Abdul Raheem Mohammad Moulana

Surah Al-Alaq in Telugu

Arabic with tafsir Listen to Surah Al-Alaq (1269 reciters)
Meccanسورة العلق19 verses

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

ٱقۡرَأۡ بِٱسۡمِ رَبِّكَ ٱلَّذِي خَلَقَ ١చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు خَلَقَ ٱلۡإِنسَٰنَ مِنۡ عَلَقٍ ٢ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు ٱقۡرَأۡ وَرَبُّكَ ٱلۡأَكۡرَمُ ٣చదువు! మరియు నీ ప్రభువు పరమదాత ٱلَّذِي عَلَّمَ بِٱلۡقَلَمِ ٤ఆయన కలం ద్వారా నేర్పాడు عَلَّمَ ٱلۡإِنسَٰنَ مَا لَمۡ يَعۡلَمۡ ٥మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు كـَلَّآ إِنَّ ٱلۡإِنسَٰنَ لَيَطۡغَىٰٓ ٦అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు أَن رَّءَاهُ ٱسۡتَغۡنَىٰٓ ٧ఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجۡعَىٰٓ ٨నిశ్చయంగా నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది أَرَءَيۡتَ ٱلَّذِي يَنۡهَىٰ ٩నీవు నిరోధించే వ్యక్తిని చూశావా عَبۡدًا إِذَا صَلَّىٰٓ ١٠నమాజ్ చేసే (అల్లాహ్) దాసుణ్ణి أَرَءَيۡتَ إِن كَانَ عَلَى ٱلۡهُدَىٰٓ ١١ఒకవేళ అతను (ముహమ్మద్!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి أَوۡ أَمَرَ بِٱلتَّقۡوَىٰٓ ١٢ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే أَرَءَيۡتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ ١٣ఒకవేళ (ఆ నిరోధించే) వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే أَلَمۡ يَعۡلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ ١٤వాస్తవానికి, అల్లాహ్ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా كـَلَّا لَئِن لَّمۡ يَنتَهِ لَنَسۡفَعَۢا بِٱلنَّاصِيَةِ ١٥అలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము نَاصِيَةٍ كَٰذِبَةٍ خَاطِئَةٍ ١٦అది అబద్ధాలలో, అపరాధాలలో మునిగివున్న నుదురు فَلۡيَدۡعُ نَادِيَهُۥ ١٧అయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను سَنَدۡعُ ٱلزَّبَانِيَةَ ١٨మేము కూడా నరక దూతలను పిలుస్తాము كـَلَّا لَا تُطِعۡهُ وَٱسۡجُدۡۤ وَٱقۡتَرِب ۩ ١٩అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు

Translation: Abdul Raheem Mohammad Moulana.