Millat al-Islam

Chapter 90 · 20 verses · Abdul Raheem Mohammad Moulana

Surah Al-Balad in Telugu

Arabic with tafsir Listen to Surah Al-Balad (1312 reciters)
Meccanسورة البلد20 verses

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

لَآ أُقۡسِمُ بِهَٰذَا ٱلۡبَلَدِ ١కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను) وَأَنتَ حِلُّۢ بِهَٰذَا ٱلۡبَلَدِ ٢మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది وَوَالِدٍ وَمَا وَلَدَ ٣మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِي كَبَدٍ ٤వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము أَيَحۡسَبُ أَن لَّن يَقۡدِرَ عَلَيۡهِ أَحَدٌ ٥ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా يَقُولُ أَهۡلَكۡتُ مَالًا لُّبَدًا ٦అతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు أَيَحۡسَبُ أَن لَّمۡ يَرَهُۥٓ أَحَدٌ ٧ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా أَلَمۡ نَجۡعَل لَّهُۥ عَيۡنَيۡنِ ٨ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా وَلِسَانًا وَشَفَتَيۡنِ ٩మరియు నాలుకను మరియు రెండు పెదవులను وَهَدَيۡنَٰهُ ٱلنَّجۡدَيۡنِ ١٠మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము فَلَا ٱقۡتَحَمَ ٱلۡعَقَبَةَ ١١కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡعَقَبَةُ ١٢మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా فَكُّ رَقَبَةٍ ١٣అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం أَوۡ إِطۡعَٰمٌ فِي يَوۡمٍ ذِي مَسۡغَبَةٍ ١٤లేదా! (స్వయంగా) ఆకలి గొని ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం يَتِيمًا ذَا مَقۡرَبَةٍ ١٥సమీప అనాథునికి గానీ أَوۡ مِسۡكِينًا ذَا مَتۡرَبَةٍ ١٦లేక, దిక్కులేని నిరుపేదకు గానీ ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ وَتَوَاصَوۡاْ بِٱلۡمَرۡحَمَةِ ١٧మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ ١٨ఇలాంటి వారే కుడిపక్షం వారు وَٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِنَا هُمۡ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ ١٩ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు عَلَيۡهِمۡ نَارٌ مُّؤۡصَدَةُۢ ٢٠వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది

Translation: Abdul Raheem Mohammad Moulana.