بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلۡبُرُوجِ ١విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా وَٱلۡيَوۡمِ ٱلۡمَوۡعُودِ ٢వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా وَشَاهِدٍ وَمَشۡهُودٍ ٣చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా قُتِلَ أَصۡحَٰبُ ٱلۡأُخۡدُودِ ٤అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు ٱلنَّارِ ذَاتِ ٱلۡوَقُودِ ٥ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు إِذۡ هُمۡ عَلَيۡهَا قُعُودٌ ٦వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు وَهُمۡ عَلَىٰ مَا يَفۡعَلُونَ بِٱلۡمُؤۡمِنِينَ شُهُودٌ ٧మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు وَمَا نَقَمُواْ مِنۡهُمۡ إِلَّآ أَن يُؤۡمِنُواْ بِٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَمِيدِ ٨మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٍ شَهِيدٌ ٩ఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి إِنَّ ٱلَّذِينَ فَتَنُواْ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ ثُمَّ لَمۡ يَتُوبُواْ فَلَهُمۡ عَذَابُ جَهَنَّمَ وَلَهُمۡ عَذَابُ ٱلۡحَرِيقِ ١٠ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَهُمۡ جَنَّٰتٌ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡكَبِيرُ ١١నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అదే గొప్ప విజయం إِنَّ بَطۡشَ رَبِّكَ لَشَدِيدٌ ١٢నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది إِنَّهُۥ هُوَ يُبۡدِئُ وَيُعِيدُ ١٣నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు وَهُوَ ٱلۡغَفُورُ ٱلۡوَدُودُ ١٤మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు ذُو ٱلۡعَرۡشِ ٱلۡمَجِيدُ ١٥సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు, మహత్త్వపూర్ణుడు فَعَّالٌ لِّمَا يُرِيدُ ١٦తాను తలచింది చేయగలవాడు هَلۡ أَتَىٰكَ حَدِيثُ ٱلۡجُنُودِ ١٧ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా فِرۡعَوۡنَ وَثَمُودَ ١٨ఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల) بَلِ ٱلَّذِينَ كَفَرُواْ فِي تَكۡذِيبٍ ١٩అలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు وَٱللَّهُ مِن وَرَآئِهِم مُّحِيطُۢ ٢٠మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు بَلۡ هُوَ قُرۡءَانٌ مَّجِيدٌ ٢١వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన ఖుర్ఆన్ فِي لَوۡحٍ مَّحۡفُوظِۭ ٢٢సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్) లో (వ్రాయబడి) ఉన్నది