أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِأَصۡحَٰبِ ٱلۡفِيلِ ١ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదాأَلَمۡ يَجۡعَلۡ كَيۡدَهُمۡ فِي تَضۡلِيلٍ ٢ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదాوَأَرۡسَلَ عَلَيۡهِمۡ طَيۡرًا أَبَابِيلَ ٣మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడుتَرۡمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ ٤అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయిفَجَعَلَهُمۡ كَعَصۡفٍ مَّأۡكُولِۭ٥ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు