بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
إِذَا وَقَعَتِ ٱلۡوَاقِعَةُ ١ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు لَيۡسَ لِوَقۡعَتِهَا كَاذِبَةٌ ٢అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు خَافِضَةٌ رَّافِعَةٌ ٣అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది إِذَا رُجَّتِ ٱلۡأَرۡضُ رَجًّا ٤భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు وَبُسَّتِ ٱلۡجِبَالُ بَسًّا ٥మరియు పర్వతాలు పొడిగా మార్చబడినపుడు فَكَانَتۡ هَبَآءً مُّنۢبَثًّا ٦అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండి పోయినపుడు وَكُنتُمۡ أَزۡوَٰجًا ثَلَٰثَةً ٧మరియు మీరు మూడు వర్గాలుగా విభజింపబడతారు فَأَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ مَآ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ ٨ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు) وَأَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ مَآ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ ٩మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు) وَٱلسَّٰبِقُونَ ٱلسَّٰبِقُونَ ١٠మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు أُوْلَٰٓئِكَ ٱلۡمُقَرَّبُونَ ١١అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు فِي جَنَّٰتِ ٱلنَّعِيمِ ١٢వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు ثُلَّةٌ مِّنَ ٱلۡأَوَّلِينَ ١٣మొదటి తరాల వారిలో నుండి చాలా మంది وَقَلِيلٌ مِّنَ ٱلۡأٓخِرِينَ ١٤మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది عَلَىٰ سُرُرٍ مَّوۡضُونَةٍ ١٥(బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద مُّتَّكِـِٔينَ عَلَيۡهَا مُتَقَٰبِلِينَ ١٦ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు يَطُوفُ عَلَيۡهِمۡ وِلۡدَٰنٌ مُّخَلَّدُونَ ١٧వారి చుట్టుప్రక్కలలో చిరంజీవులైన (నిత్యబాల్యం గల) బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు بِأَكۡوَابٍ وَأَبَارِيقَ وَكَأۡسٍ مِّن مَّعِينٍ ١٨(మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో لَّا يُصَدَّعُونَ عَنۡهَا وَلَا يُنزِفُونَ ١٩దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు وَفَٰكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُونَ ٢٠మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి وَلَحۡمِ طَيۡرٍ مِّمَّا يَشۡتَهُونَ ٢١మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం وَحُورٌ عِينٌ ٢٢మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్) كَأَمۡثَٰلِ ٱللُّؤۡلُوِٕ ٱلۡمَكۡنُونِ ٢٣దాచబడిన ముత్యాల వలే جَزَآءَۢ بِمَا كَانُواْ يَعۡمَلُونَ ٢٤ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా لَا يَسۡمَعُونَ فِيهَا لَغۡوًا وَلَا تَأۡثِيمًا ٢٥అందులో వారు వ్యర్థమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు إِلَّا قِيلًا سَلَٰمًا سَلَٰمًا ٢٦శాంతి (సలాం) శాంతి (సలాం)!" అనే మాటలు తప్ప وَأَصۡحَٰبُ ٱلۡيَمِينِ مَآ أَصۡحَٰبُ ٱلۡيَمِينِ ٢٧మరియు కుడి పక్షం వారు, ఆ కుడి పక్షం వారు ఎంత (అదృష్టవంతులు) فِي سِدۡرٍ مَّخۡضُودٍ ٢٨వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య وَطَلۡحٍ مَّنضُودٍ ٢٩మరియు పండ్ల గెలలతో నిండిన అరటి చెట్లు وَظِلٍّ مَّمۡدُودٍ ٣٠మరియు వ్యాపించి ఉన్న నీడలు وَمَآءٍ مَّسۡكُوبٍ ٣١మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు وَفَٰكِهَةٍ كَثِيرَةٍ ٣٢మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు لَّا مَقۡطُوعَةٍ وَلَا مَمۡنُوعَةٍ ٣٣ఎడతెగకుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో) وَفُرُشٍ مَّرۡفُوعَةٍ ٣٤మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు إِنَّآ أَنشَأۡنَٰهُنَّ إِنشَآءً ٣٥నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము فَجَعَلۡنَٰهُنَّ أَبۡكَارًا ٣٦మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము عُرُبًا أَتۡرَابًا ٣٧వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు) لِّأَصۡحَٰبِ ٱلۡيَمِينِ ٣٨కుడిపక్షం వారి కొరకు ثُلَّةٌ مِّنَ ٱلۡأَوَّلِينَ ٣٩అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు وَثُلَّةٌ مِّنَ ٱلۡأٓخِرِينَ ٤٠మరియు తరువాత తరాల వారిలో నుండి చాలా మంది ఉంటారు وَأَصۡحَٰبُ ٱلشِّمَالِ مَآ أَصۡحَٰبُ ٱلشِّمَالِ ٤١ఇక వామ(ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు) فِي سَمُومٍ وَحَمِيمٍ ٤٢వారు దహించే నరకాగ్నిలో మరియు సలసలకాగే నీటిలో وَظِلٍّ مِّن يَحۡمُومٍ ٤٣మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు) لَّا بَارِدٍ وَلَا كَرِيمٍ ٤٤అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు إِنَّهُمۡ كَانُواْ قَبۡلَ ذَٰلِكَ مُتۡرَفِينَ ٤٥నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి وَكَانُواْ يُصِرُّونَ عَلَى ٱلۡحِنثِ ٱلۡعَظِيمِ ٤٦మరియు వారి మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి وَكَانُواْ يَقُولُونَ أَئِذَا مِتۡنَا وَكُنَّا تُرَابًا وَعِظَٰمًا أَءِنَّا لَمَبۡعُوثُونَ ٤٧మరియు వారు ఇలా అనేవారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా أَوَءَابَآؤُنَا ٱلۡأَوَّلُونَ ٤٨మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా قُلۡ إِنَّ ٱلۡأَوَّلِينَ وَٱلۡأٓخِرِينَ ٤٩వారితో ఇలా అను: "నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ لَمَجۡمُوعُونَ إِلَىٰ مِيقَٰتِ يَوۡمٍ مَّعۡلُومٍ ٥٠వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశ పరచబడతారు ثُمَّ إِنَّكُمۡ أَيُّهَا ٱلضَّآلُّونَ ٱلۡمُكَذِّبُونَ ٥١ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా لَأٓكِلُونَ مِن شَجَرٍ مِّن زَقُّومٍ ٥٢మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు فَمَالِـُٔونَ مِنۡهَا ٱلۡبُطُونَ ٥٣దానితో కడుపులు నింపుకుంటారు فَشَٰرِبُونَ عَلَيۡهِ مِنَ ٱلۡحَمِيمِ ٥٤తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు فَشَٰرِبُونَ شُرۡبَ ٱلۡهِيمِ ٥٥వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు هَٰذَا نُزُلُهُمۡ يَوۡمَ ٱلدِّينِ ٥٦తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే نَحۡنُ خَلَقۡنَٰكُمۡ فَلَوۡلَا تُصَدِّقُونَ ٥٧మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు أَفَرَءَيۡتُم مَّا تُمۡنُونَ ٥٨ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా ءَأَنتُمۡ تَخۡلُقُونَهُۥٓ أَمۡ نَحۡنُ ٱلۡخَٰلِقُونَ ٥٩ఏమీ? మీరా, దానిని సృష్టించేవారు? లేక మేమా దాని సృష్టికర్తలము نَحۡنُ قَدَّرۡنَا بَيۡنَكُمُ ٱلۡمَوۡتَ وَمَا نَحۡنُ بِمَسۡبُوقِينَ ٦٠మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు عَلَىٰٓ أَن نُّبَدِّلَ أَمۡثَٰلَكُمۡ وَنُنشِئَكُمۡ فِي مَا لَا تَعۡلَمُونَ ٦١మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి وَلَقَدۡ عَلِمۡتُمُ ٱلنَّشۡأَةَ ٱلۡأُولَىٰ فَلَوۡلَا تَذَكَّرُونَ ٦٢మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు أَفَرَءَيۡتُم مَّا تَحۡرُثُونَ ٦٣మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా ءَأَنتُمۡ تَزۡرَعُونَهُۥٓ أَمۡ نَحۡنُ ٱلزَّٰرِعُونَ ٦٤మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము لَوۡ نَشَآءُ لَجَعَلۡنَٰهُ حُطَٰمًا فَظَلۡتُمۡ تَفَكَّهُونَ ٦٥మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు إِنَّا لَمُغۡرَمُونَ ٦٦(మీరు అనేవారు): "నిశ్చయంగా, మేము పాడై పోయాము بَلۡ نَحۡنُ مَحۡرُومُونَ ٦٧కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని أَفَرَءَيۡتُمُ ٱلۡمَآءَ ٱلَّذِي تَشۡرَبُونَ ٦٨ఏమీ? మీరెప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా ءَأَنتُمۡ أَنزَلۡتُمُوهُ مِنَ ٱلۡمُزۡنِ أَمۡ نَحۡنُ ٱلۡمُنزِلُونَ ٦٩మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించేవారము لَوۡ نَشَآءُ جَعَلۡنَٰهُ أُجَاجًا فَلَوۡلَا تَشۡكُرُونَ ٧٠మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞతలు చూపరు أَفَرَءَيۡتُمُ ٱلنَّارَ ٱلَّتِي تُورُونَ ٧١మీరు రాజేసే అగ్నిని గమనించారా ءَأَنتُمۡ أَنشَأۡتُمۡ شَجَرَتَهَآ أَمۡ نَحۡنُ ٱلۡمُنشِـُٔونَ ٧٢దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా نَحۡنُ جَعَلۡنَٰهَا تَذۡكِرَةً وَمَتَٰعًا لِّلۡمُقۡوِينَ ٧٣మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ ٧٤కావున సర్వత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు ۞ فَلَآ أُقۡسِمُ بِمَوَٰقِعِ ٱلنُّجُومِ ٧٥ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను وَإِنَّهُۥ لَقَسَمٌ لَّوۡ تَعۡلَمُونَ عَظِيمٌ ٧٦మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది إِنَّهُۥ لَقُرۡءَانٌ كَرِيمٌ ٧٧నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది فِي كِتَٰبٍ مَّكۡنُونٍ ٧٨సురక్షితమైన గ్రంథంలో ఉన్నది لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلۡمُطَهَّرُونَ ٧٩దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు تَنزِيلٌ مِّن رَّبِّ ٱلۡعَٰلَمِينَ ٨٠ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది أَفَبِهَٰذَا ٱلۡحَدِيثِ أَنتُم مُّدۡهِنُونَ ٨١ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా وَتَجۡعَلُونَ رِزۡقَكُمۡ أَنَّكُمۡ تُكَذِّبُونَ ٨٢మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా فَلَوۡلَآ إِذَا بَلَغَتِ ٱلۡحُلۡقُومَ ٨٣అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు) وَأَنتُمۡ حِينَئِذٍ تَنظُرُونَ ٨٤మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు وَنَحۡنُ أَقۡرَبُ إِلَيۡهِ مِنكُمۡ وَلَٰكِن لَّا تُبۡصِرُونَ ٨٥మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు فَلَوۡلَآ إِن كُنتُمۡ غَيۡرَ مَدِينِينَ ٨٦ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే تَرۡجِعُونَهَآ إِن كُنتُمۡ صَٰدِقِينَ ٨٧మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు فَأَمَّآ إِن كَانَ مِنَ ٱلۡمُقَرَّبِينَ ٨٨కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే فَرَوۡحٌ وَرَيۡحَانٌ وَجَنَّتُ نَعِيمٍ ٨٩అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి وَأَمَّآ إِن كَانَ مِنۡ أَصۡحَٰبِ ٱلۡيَمِينِ ٩٠మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో فَسَلَٰمٌ لَّكَ مِنۡ أَصۡحَٰبِ ٱلۡيَمِينِ ٩١అతనితో: "నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది) وَأَمَّآ إِن كَانَ مِنَ ٱلۡمُكَذِّبِينَ ٱلضَّآلِّينَ ٩٢మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో فَنُزُلٌ مِّنۡ حَمِيمٍ ٩٣అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది وَتَصۡلِيَةُ جَحِيمٍ ٩٤మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ ٱلۡيَقِينِ ٩٥నిశ్చయంగా, ఇది రూఢి అయిన నమ్మదగిన సత్యం فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ ٩٦కావున సర్వత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు