ملة الإسلام

السورة 88 · 26 آية · Abdul Raheem Mohammad Moulana

سورة الغاشية باللغة التيلوغوية

السورة بالعربية مع التفسير استمع إلى سورة الغاشية (1,313 قارئاً)
مكيةسورة الغاشية٢٦ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

هَلۡ أَتَىٰكَ حَدِيثُ ٱلۡغَٰشِيَةِ ١హఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు (పునరుత్థాన దినపు) సమాచారం నీకు అందిందా وُجُوهٌ يَوۡمَئِذٍ خَٰشِعَةٌ ٢కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి عَامِلَةٌ نَّاصِبَةٌ ٣(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి تَصۡلَىٰ نَارًا حَامِيَةً ٤వారు దహించే అగ్నిలో పడి కాలుతారు تُسۡقَىٰ مِنۡ عَيۡنٍ ءَانِيَةٍ ٥వారికి సలసల కాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది لَّيۡسَ لَهُمۡ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ ٦వారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు لَّا يُسۡمِنُ وَلَا يُغۡنِي مِن جُوعٍ ٧అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు وُجُوهٌ يَوۡمَئِذٍ نَّاعِمَةٌ ٨ఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి لِّسَعۡيِهَا رَاضِيَةٌ ٩తాము చేసుకున్న సత్కార్యాలకు (ఫలితాలకు) వారు సంతోషపడుతూ ఉంటారు فِي جَنَّةٍ عَالِيَةٍ ١٠అత్యున్నతమైన స్వర్గవనంలో لَّا تَسۡمَعُ فِيهَا لَٰغِيَةً ١١అందులో వారు ఎలాంటి వృథా మాటలు వినరు فِيهَا عَيۡنٌ جَارِيَةٌ ١٢అందులో ప్రవహించే సెలయేళ్ళు ఉంటాయి فِيهَا سُرُرٌ مَّرۡفُوعَةٌ ١٣అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి وَأَكۡوَابٌ مَّوۡضُوعَةٌ ١٤మరియు పేర్చబడిన (మధు) పాత్రలు وَنَمَارِقُ مَصۡفُوفَةٌ ١٥మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు وَزَرَابِيُّ مَبۡثُوثَةٌ ١٦మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు أَفَلَا يَنظُرُونَ إِلَى ٱلۡإِبِلِ كَيۡفَ خُلِقَتۡ ١٧ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో وَإِلَى ٱلسَّمَآءِ كَيۡفَ رُفِعَتۡ ١٨మరియు ఆకాశం వైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో وَإِلَى ٱلۡجِبَالِ كَيۡفَ نُصِبَتۡ ١٩మరియు కొండల వైపుకు చూడరా?అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో وَإِلَى ٱلۡأَرۡضِ كَيۡفَ سُطِحَتۡ ٢٠మరియు భూమి వైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో فَذَكِّرۡ إِنَّمَآ أَنتَ مُذَكِّرٌ ٢١కావున (ఓ ముహమ్మద్!) నీవు హితోపదేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసే వాడవు మాత్రమే لَّسۡتَ عَلَيۡهِم بِمُصَيۡطِرٍ ٢٢నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ ٢٣ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో فَيُعَذِّبُهُ ٱللَّهُ ٱلۡعَذَابَ ٱلۡأَكۡبَرَ ٢٤అప్పుడు అతనికి అల్లాహ్ ఘోరశిక్ష విధిస్తాడు إِنَّ إِلَيۡنَآ إِيَابَهُمۡ ٢٥నిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది ثُمَّ إِنَّ عَلَيۡنَا حِسَابَهُم ٢٦ఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే

الترجمة: Abdul Raheem Mohammad Moulana.