ملة الإسلام

السورة 75 · 40 آية · Abdul Raheem Mohammad Moulana

سورة القيامة باللغة التيلوغوية

السورة بالعربية مع التفسير استمع إلى سورة القيامة (1,389 قارئاً)
مكيةسورة القيامة٤٠ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

لَآ أُقۡسِمُ بِيَوۡمِ ٱلۡقِيَٰمَةِ ١అలా కాదు! నేను పునరుత్థాన దినపు శపథం చేస్తున్నాను وَلَآ أُقۡسِمُ بِٱلنَّفۡسِ ٱللَّوَّامَةِ ٢అలా కాదు! నేను తనను తాను నిందించుకునే అంతరాత్మ శపథం చేస్తున్నాను أَيَحۡسَبُ ٱلۡإِنسَٰنُ أَلَّن نَّجۡمَعَ عِظَامَهُۥ ٣ఏమిటి? మేము అతని ఎముకలను ప్రోగు చేయలేమని మానవుడు భావిస్తున్నాడా بَلَىٰ قَٰدِرِينَ عَلَىٰٓ أَن نُّسَوِّيَ بَنَانَهُۥ ٤వాస్తవానికి! మేము అతని వ్రేళ్ళ కొనలను గూడా సరిగ్గా సవరించగల సమర్ధులము بَلۡ يُرِيدُ ٱلۡإِنسَٰنُ لِيَفۡجُرَ أَمَامَهُۥ ٥అయినా, మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు يَسۡـَٔلُ أَيَّانَ يَوۡمُ ٱلۡقِيَٰمَةِ ٦అతడు: "అయితే ఈ పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుంది?" అని అడుగుతున్నాడు فَإِذَا بَرِقَ ٱلۡبَصَرُ ٧కళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు وَخَسَفَ ٱلۡقَمَرُ ٨మరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు وَجُمِعَ ٱلشَّمۡسُ وَٱلۡقَمَرُ ٩మరియు సూర్యచంద్రులు కలిపి వేయబడినప్పుడు يَقُولُ ٱلۡإِنسَٰنُ يَوۡمَئِذٍ أَيۡنَ ٱلۡمَفَرُّ ١٠మానవుడు ఆ రోజు: "ఎక్కడికి పారి పోవాలి?" అని అంటాడు كـَلَّا لَا وَزَرَ ١١అది కాదు! (అతనికి) ఎక్కడా శరణం ఉండదు إِلَىٰ رَبِّكَ يَوۡمَئِذٍ ٱلۡمُسۡتَقَرُّ ١٢ఆ రోజు నీ ప్రభువు వద్దనే ఆశ్రయం ఉంటుంది يُنَبَّؤُاْ ٱلۡإِنسَٰنُ يَوۡمَئِذِۭ بِمَا قَدَّمَ وَأَخَّرَ ١٣ఆ రోజు మానవుడికి, తాను చేసి పంపంది మరియు వెనక వదలింది అంతా తెలుపబడుతుంది بَلِ ٱلۡإِنسَٰنُ عَلَىٰ نَفۡسِهِۦ بَصِيرَةٌ ١٤అలా కాదు! మానవుడు తనకు విరుద్ధంగా, తానే సాక్షి అవుతాడు وَلَوۡ أَلۡقَىٰ مَعَاذِيرَهُۥ ١٥మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే لَا تُحَرِّكۡ بِهِۦ لِسَانَكَ لِتَعۡجَلَ بِهِۦٓ ١٦నీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను గ్రహించటానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు إِنَّ عَلَيۡنَا جَمۡعَهُۥ وَقُرۡءَانَهُۥ ١٧నిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే فَإِذَا قَرَأۡنَٰهُ فَٱتَّبِعۡ قُرۡءَانَهُۥ ١٨కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు ثُمَّ إِنَّ عَلَيۡنَا بَيَانَهُۥ ١٩ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే كـَلَّا بَلۡ تُحِبُّونَ ٱلۡعَاجِلَةَ ٢٠అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు وَتَذَرُونَ ٱلۡأٓخِرَةَ ٢١మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు وُجُوهٌ يَوۡمَئِذٍ نَّاضِرَةٌ ٢٢ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌ ٢٣తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి وَوُجُوهٌ يَوۡمَئِذِۭ بَاسِرَةٌ ٢٤మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి تَظُنُّ أَن يُفۡعَلَ بِهَا فَاقِرَةٌ ٢٥నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి كـَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِيَ ٢٦అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు وَقِيلَ مَنۡۜ رَاقٍ ٢٧మరియు: "ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది وَظَنَّ أَنَّهُ ٱلۡفِرَاقُ ٢٨మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు وَٱلۡتَفَّتِ ٱلسَّاقُ بِٱلسَّاقِ ٢٩మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది إِلَىٰ رَبِّكَ يَوۡمَئِذٍ ٱلۡمَسَاقُ ٣٠ఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ ٣١కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపనూ లేదు وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ ٣٢మరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهۡلِهِۦ يَتَمَطَّىٰٓ ٣٣ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు أَوۡلَىٰ لَكَ فَأَوۡلَىٰ ٣٤(ఓ సత్యతిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది ثُمَّ أَوۡلَىٰ لَكَ فَأَوۡلَىٰٓ ٣٥అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది أَيَحۡسَبُ ٱلۡإِنسَٰنُ أَن يُتۡرَكَ سُدًى ٣٦ఏమిటీ? మానవుడు తనను విచ్చల విడిగా వదలిపెట్టండం జరుగుతుందని భావిస్తున్నాడా أَلَمۡ يَكُ نُطۡفَةً مِّن مَّنِيٍّ يُمۡنَىٰ ٣٧ఏమీ? అతడు ప్రసరింప జేయబడిన ఒక వీర్యబిందువు కాడా ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ ٣٨తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు فَجَعَلَ مِنۡهُ ٱلزَّوۡجَيۡنِ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ ٣٩ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు أَلَيۡسَ ذَٰلِكَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحۡـِۧيَ ٱلۡمَوۡتَىٰ ٤٠అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా

الترجمة: Abdul Raheem Mohammad Moulana.