Millat al-Islam

Chapter 99 · 8 verses · Abdul Raheem Mohammad Moulana

Surah Az-Zalzala in Telugu

Arabic with tafsir Listen to Surah Az-Zalzala (1306 reciters)

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا ١భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا ٢మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا ٣మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు يَوۡمَئِذٍ تُحَدِّثُ أَخۡبَارَهَا ٤ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا ٥ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు يَوۡمَئِذٍ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتًا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ ٦ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرًا يَرَهُۥ ٧అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُۥ ٨మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు

Translation: Abdul Raheem Mohammad Moulana.