ملة الإسلام

السورة 92 · 21 آية · Abdul Raheem Mohammad Moulana

سورة الليل باللغة التيلوغوية

السورة بالعربية مع التفسير استمع إلى سورة الليل (1,297 قارئاً)
مكيةسورة الليل٢١ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰ ١క్రమ్ముకునే రాత్రి సాక్షిగా وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ ٢ప్రకాశించే పగటి సాక్షిగా وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ ٣మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా إِنَّ سَعۡيَكُمۡ لَشَتَّىٰ ٤వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి فَأَمَّا مَنۡ أَعۡطَىٰ وَٱتَّقَىٰ ٥కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో وَصَدَّقَ بِٱلۡحُسۡنَىٰ ٦మరియు మంచిని నమ్ముతాడో فَسَنُيَسِّرُهُۥ لِلۡيُسۡرَىٰ ٧అతనికి మేము మేలు కొరకు దారిని సులభం చేస్తాము وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسۡتَغۡنَىٰ ٨కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో وَكَذَّبَ بِٱلۡحُسۡنَىٰ ٩మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో فَسَنُيَسِّرُهُۥ لِلۡعُسۡرَىٰ ١٠అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము وَمَا يُغۡنِي عَنۡهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ ١١మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది إِنَّ عَلَيۡنَا لَلۡهُدَىٰ ١٢నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని وَإِنَّ لَنَا لَلۡأٓخِرَةَ وَٱلۡأُولَىٰ ١٣మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది فَأَنذَرۡتُكُمۡ نَارًا تَلَظَّىٰ ١٤కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను لَا يَصۡلَىٰهَآ إِلَّا ٱلۡأَشۡقَى ١٥పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు ٱلَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ ١٦ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో وَسَيُجَنَّبُهَا ٱلۡأَتۡقَى ١٧కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు ٱلَّذِي يُؤۡتِي مَالَهُۥ يَتَزَكَّىٰ ١٨అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعۡمَةٍ تُجۡزَىٰٓ ١٩కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక إِلَّا ٱبۡتِغَآءَ وَجۡهِ رَبِّهِ ٱلۡأَعۡلَىٰ ٢٠కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే وَلَسَوۡفَ يَرۡضَىٰ ٢١మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు

الترجمة: Abdul Raheem Mohammad Moulana.